Top
logo

హైదరాబాద్‌లో దారుణం..16ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌

హైదరాబాద్‌లో దారుణం..16ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌
X
Highlights

హైదరాబాద్ పాతబస్తీ కామాటీపురా పోలీస్‌స్టేషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేప్ కేసులో నిందితుడిగా ఉన్న...

హైదరాబాద్ పాతబస్తీ కామాటీపురా పోలీస్‌స్టేషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని సాక్షిగా చేర్చారంటూ బాధితురాలి బంధువులు, స్ధానికులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. స్ధానికంగా ఉన్న 16 ఏళ్ల బాలికపై 11 మంది యువకులు గ్యాంగ్ రేప్ చేశారంటూ గత నెల 24న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలికపై అత్యాచార దృశ్యాలను సెల్‌ ఫోన్లలో రికార్డ్ చేసి ... సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి పలుసార్లు అత్యాచారం చేసినట్టు దర్యాప్తు వెల్లడైంది.

ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేసి మరోకరిని సాక్షిగా చేర్చడంపై బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి మద్ధతుగా స్ధానికులు, విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. సెల్‌ఫోన్‌లో అత్యాచార దృశ్యాలు ఉంచుకున్న నిందితుడిని సాక్షిగా ఎలా చేరుస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెబుతున్నారు.

Next Story