Top
logo

మరి కొద్ది గంటల్లో పెళ్లి అన్నాడు..ఏం కాదు నేను ఉన్నా అంటూ చివరికి..

మరి కొద్ది గంటల్లో పెళ్లి అన్నాడు..ఏం కాదు నేను ఉన్నా అంటూ చివరికి..
X
Highlights

మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమయ్యాయి. ...

మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు అన్న సినీ కవి మాటలు అక్షర సత్యమయ్యాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజూ మహిళలు, పసికందులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతునే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మానవమృగాలకు బలికాక తప్పడంలేదు. బడిపంతుల్లు, లెక్చరర్లు, ఇలా ప్రతిఒక్కరు ముక్కుపచ్చలారని బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా పోలీస్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు జి.కోటిరెడ్డి. గత ఏడాది కిందట గుంటూరులోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా తనివితీర అనుభవించాలని ఫిక్స్ అయ్యాడు. మెళ్లిగా ఆమెతో పరిచయం పెంచుకోవాలని అనుకున్నాడు. అంతే రంగంలో దిగిన కోటి రెడ్డి తనకు మంచి ఉద్యోగం, అధిక వేతనం ఉందంటూ ఆ అమ్మాయి వెంటపడి మొత్తానికి దగ్గరయ్యాడు. అయితే మొదట ఫ్రెండ్షిప్ లాగే సాగించాడు ఆ తర్వాత ప్రేమ అన్నాడు. అయితే ప్రేమఅంటే ఎంటో ఎలా ఉంటుదో కూడా తనకు తెలియదు. అలాంటిది ఇతడి బుట్టలో పడ్డాక సినిమాలు, షికార్లకు అంటూ తీప్పడం మొదలు పెట్టాడు దీంతో ఇదే నా ప్రపంచం అనుకుంది ఆ అమాయకురాలు. ఇలా ఓ సంవత్సరం పాటు చెట్టపట్టలేసుకుంటూ తీరగడం జరిగింది.ఈ నేపథ్యంలో మనం పెళ్లి చేసుకుందాం అంది ఆ యువతి. దానికి కోటిరెడ్డి అయ్యో దాందేముంది చేసేసుకుందాం అన్నాడు. గుండెల్లో ఏదో భారం దిగిపోయినట్లు ఫీలైంది ఆ యువతి. తాను వివాహం చేసుకోబోతున్నాని తెగ సంబర పడిపోయింది ఆ యువతి.

ఇంకేముంది ఇదే అదునుగా చేసుకున్న కోటిరెడ్డి ఈ నెల 8న గుంటూరులోని ఆమె చదువుతున్న కళాశాలకు వెళ్లి మనం ఇప్పుడే, ఈ క్షణమే వివాహం చేసుకుందాం నడువు పోదాం అన్నాడు. వెంటనే బుక్స్‌తో సహా క్లాస్ రూంలోంచీ అతని చేయి పట్టుకొని తన వెంట వెళ్లిపోయింది. క్లాస్ ఉన్నావారందరూ ఒక్కసారిగా నోరు ఎల్లబెట్టారు. ఒంగోలు నిర్మల్‌ నగర్‌లోని ఓ గదిలో ఆమెను బంధించాడు. మనం మరి కొద్ది గంటల్లో పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు. దాని ఆ యువతికి సరే అన్నాది. దీంతో వెంటనే కామంతో ఉన్న ఆ కీచకుడు యువతితో మాట్లాడుతూ ఈ గదిలో ఉన్నది మనిద్దరమే అంటూ తన భూజలపై చేయి వేసాడు దీనికి ఆ యువతి ఇవన్నీ పెళ్లి తర్వాతే అంది.

అరే ఈరోజేగా మన పెళ్లి అని అన్నాడు. దానికెందుకు అంతాల భయపడుతున్నావ్ అన్నాడు. అరే ఏం కాదు నేను ఉన్నా కదా అంటూ కిటికీ కర్టెన్ మూసేశాడు. అలా రెండ్రోజుల పాటు తనివీ తీరా అనుభవించాడు. జులై 10న నా పరిస్థితులు బాలేవు. నువ్వు వెంటనే గుంటూరుకి వెళ్లిపో అన్నాడు. నన్ను పెళ్లి చేసుకో అంది. పెళ్లిది ఏం ఉంది తర్వాత చూద్దాం లే అన్నాడు. నన్ను మోసం చేయవద్దు అంటూ వేడుకుంది. నాకు ఆసక్తి లేదు అన్నాడు. నా జీవితంతో ఆడుకున్నావ్ అని ఫైర్ అయ్యింది. ఏం చేస్తావో చేసుకోపో పెళ్లి మాత్రం చేసుకోను అంటూ గదిలోంచీ ఆ యువతిని గెంటేశాడు. దీంతో బధితురాలు ఒంగోలు పోలీసుల్ని ఆశ్రయించింది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. యువతిని ఒంగోలులోని హోంకి తరలించి పరారీలో ఉన్న కోటిరెడ్డి కోసం గాలిస్తున్నారు.

Next Story