సోషల్‌ మీడియాలో పరిచయం.. డేటింగ్..ఆ తరువాత ఫొటోలు తీసుకొని..

సోషల్‌ మీడియాలో పరిచయం.. డేటింగ్..ఆ తరువాత ఫొటోలు తీసుకొని..
x
Highlights

వారిద్దరు సోషల్ మీడియా పరిచం అయ్యారు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అది కాస్తా చివరికి సహజీవనానికి దారితీసింది. ఇంకేముంది చివరికి ఈ సహజీవనమే...

వారిద్దరు సోషల్ మీడియా పరిచం అయ్యారు. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అది కాస్తా చివరికి సహజీవనానికి దారితీసింది. ఇంకేముంది చివరికి ఈ సహజీవనమే యువతి కొంపముంచింది. సహజీవనం చేసినప్పటి ఫోటోలను అడ్డుపెటుకొని ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు ఓ వ్యక్తి. అలా బెదిరింపులకు దిగుతూ పెద్దమొత్తంలో పైసలు దండుకున్న ఓఅరబ్ వ్యక్తికి అబుదాబి కోర్టు ఏడాది జైలుతో పాటు రూ.94 లక్షలు జుర్మానా విధించింది. ఇకవివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళతో సహజీవనం చేసిన సయమంలో ఆమె అసభ్యకర ఫొటోలను తీసుకున్నాడు ఆ నిందితుడు.

కాగా మోజుతీరాక ఆ ఫోటోలను అడ్డుపెట్టుకొని ఆమెను బెదిరించిడం ప్రారంభించాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మాత్రం నీ ఫోటోలను మొత్తం సోషల్ మీడియాలో పెడతానని పలుమార్లు బెదిరించాడు. దీంతో అతని వేధింపులు పెట్టి రూ. కోటి 30 లక్షల వరకు ఆమె నుండి తీసుకున్నాడు. అయితే ఆ తరువాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు. మళ్లీ డబ్బులు కావాలని బెదిరిస్తుండడంలో ఆ మహిళా చేసేది ఏం లేక పోలీసులను ఆశ్రయించింది. ఇక ఆమె పెట్టిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిందితుడిని అబుదాబి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో నిందితుడికి భారీ జుర్మానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories