జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మారణహోమం.. 44 మంది జవాన్ల మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మారణహోమం.. 44 మంది జవాన్ల మృతి
x
Highlights

కొన్నినెలలుగా భారత సైన్యం చేతిలో చావు దెబ్బలు తింటున్న జైషే మహమ్మద్ టెర్రరిస్టులు, అదును చూసి పంజా విసిరారు. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో...

కొన్నినెలలుగా భారత సైన్యం చేతిలో చావు దెబ్బలు తింటున్న జైషే మహమ్మద్ టెర్రరిస్టులు, అదును చూసి పంజా విసిరారు. జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లాలో మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదుల కొందరు ఆత్మాహుతి దాడి చేయడంతో 44 మంది జవాన్ల శరీరాలు తెగిపడ్డాయి. జవాన్ల వాహనాలు తునాతునకలు అయ్యాయి. CRPF 54వ బెటాలియన్‌కి చెందిన జవాన్లు 70 వాహనాల్లో జమ్ము- శ్రీనగర్ హైవేలో ప్రయాణిస్తుండగా దాడి చేశారు. ఈ దాడికి కారుబాంబును ఉపయోగించారు జైష్- ఎ- మహ్మద్ తీవ్రవాదులు. సాధ్యమైనంత ఎక్కువమంది భద్రతా సిబ్బందిని పొట్టునపెట్టుకునే లక్ష్యంతోనే కారుబాంబుదాడికి జైష్ ఏ మహ్మద్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ముష్కరులు మానవహననం కోసం కారుబాంబు పద్దతులనే అవలంభిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ తరహాదాడులు పలుదేశాల్లో పెరుగుతున్నాయి. 2001, అక్టోబర్‌ 1న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీపై జైషే ఉగ్రవాదులు చేసిన దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 44 మంది జవాన్లను కోల్పోయామని సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories