Maharashtra Horror: సర్పంచ్‌ ఎన్నికల కోసం కుమార్తె హత్య ...మహారాష్ట్రలో సంచలనం

సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆరేళ్ల కుమార్తెను తండ్రే హత్య చేసిన ఘటన మహారాష్ట్ర నాందేడ్‌లో కలకలం రేపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Feb 2026 3:31 PM IST
Maharashtra Horror: సర్పంచ్‌ ఎన్నికల కోసం కుమార్తె హత్య ...మహారాష్ట్రలో సంచలనం
X

Maharashtra Horror: సర్పంచ్‌ ఎన్నికల కోసం కుమార్తె హత్య ...మహారాష్ట్రలో సంచలనం

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించాలనే ఉద్దేశంతో ఓ తండ్రి తన ఆరేళ్ల కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రామ సర్పంచ్‌ ఎన్నికల నిబంధనల ప్రకారం ఇద్దరు పిల్లలు ఉన్నవారికే పోటీ చేసే అర్హత ఉండటంతో, మూడో సంతానం అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే అతడు తన ఆరేళ్ల కుమార్తెను కాలువలోకి తోసివేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ ఘటన అనంతరం బాలిక మృతదేహం తెలంగాణలో బయటపడింది. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టి, బాలికను హత్య చేసినది తండ్రేనని నిర్ధారించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నారి హత్య వెనుక ఎన్నికల అర్హత కారణంగా జరిగిన నేరంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story