కోలుకుంటోన్న మధులిక

కోలుకుంటోన్న మధులిక
x
Highlights

ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురైన మధులిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఐదుగురు డాక్టర్ల బృందం ఏడు గంటలపాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేసిన...

ప్రేమోన్మాది చేతిలో కత్తిపోట్లకు గురైన మధులిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ఐదుగురు డాక్టర్ల బృందం ఏడు గంటలపాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేసిన తరువాత మధులిక కోలుకుంటున్నట్టు యశోదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని సీఓఓ విజయ్ కుమార్ వెల్లడించారు, మధులిక సైగలు చేస్తోందని.. ఇప్పటికే మధులిక బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశామని ఆయన చెప్పారు. తల వెనక భాగంలో విరిగిన ఎముక భాగాలను తొలగించామని న్యూరో సర్జన్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

గాయాలకు ఇన్ఫెక్షన్‌ అవకాశం ఎక్కువగా ఉందని, కండరాలు తెగిపోయిన చోట సర్జరీలు చేశామని చెప్పారు. వెంటిలేటర్ తొలగిస్తే ఆమె మాట్లాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు ఆమెను వెంటిలేటర్‌పైనే ఉంచుతామని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories