Top
logo

అంజన్న ఆలయాన్ని ఢీకొట్టిన లారీ..!

అంజన్న ఆలయాన్ని ఢీకొట్టిన లారీ..!
Highlights

ఒంగోలు-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న ఓ లారీ ...

ఒంగోలు-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న ఓ లారీ అద్దంకి మండలం వెంకటాపురం గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని లారీ ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో లారీ డ్రైవర్,క్లీనర్ అక్కడిక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ లారీ బహార్ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. కాగా మృతదేహలను స్థానికుల సహయంతో బయటకు తీశారు. అయితే నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని పోలీసులు తెలిపారు.

Next Story


లైవ్ టీవి