Lawyer Phone Gift: పెళ్లి రోజున భార్యకు ఫోన్ బహుమతిగా ఇచ్చిన లాయర్‌కు ఊహించని షాక్

Lawyer Phone Gift: పెళ్లి రోజున భార్యకు ఫోన్ బహుమతిగా ఇచ్చిన లాయర్‌కు ఊహించని షాక్
x

Lawyer Phone Gift: పెళ్లి రోజున భార్యకు ఫోన్ బహుమతిగా ఇచ్చిన లాయర్‌కు ఊహించని షాక్

Highlights

పెళ్లి రోజు భార్యకు స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చిన ఓ లాయర్‌కు భారీ షాక్ తగిలింది. ఆ ఫోన్ సైబర్ నేరానికి సంబంధించి ఉండటంతో గుజరాత్‌ పోలీసులు అకస్మాత్తుగా ఆయన ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు.

కోల్‌కతా: పెళ్లి రోజు భార్యకు స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చిన ఓ లాయర్‌కు భారీ షాక్ తగిలింది. ఆ ఫోన్ సైబర్ నేరానికి సంబంధించి ఉండటంతో గుజరాత్‌ పోలీసులు అకస్మాత్తుగా ఆయన ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటన కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ ప్రాంతంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే, సాల్ట్‌లేక్‌కు చెందిన ఓ లాయర్ తన పెళ్లి రోజు సందర్భంగా భార్యకు ఫోన్‌ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించాడు. దానికి అనుగుణంగా, స్థానిక మిషన్ రో ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలోని షాపులో రూ. 49 వేల విలువైన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌తో సహా సీల్‌ఫ్యాక్‌గా కొనుగోలు చేశాడు. ఫోన్‌ను చూసిన భార్య ఆనందంగా స్వీకరించింది. అయితే, కొన్ని వారాల తర్వాత ఏమీ ఊహించని పరిస్థితి తలెత్తింది.

హఠాత్తుగా గుజరాత్‌ పోలీసు అధికారులు లాయర్ ఇంటికి వచ్చి ఆ ఫోన్‌ గతంలో సైబర్ నేరానికి సంబంధించి ట్రాక్‌ అయ్యిందని చెప్పారు. ఫోన్‌ ఐఎమ్ఈఐ నంబర్ ఆధారంగా ఆ చిరునామాను గుర్తించామని వెల్లడించారు. దీంతో లాయర్ దంపతులు షాక్‌కి గురయ్యారు. తాము ఏ నేరంలోనూ భాగస్వాములం కాదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో లాయర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు ఫోన్‌ను విక్రయించిన షాపుపై ఫిర్యాదు చేసిన ఆయన.. నిజానిజాలను తేల్చాలని కోరాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు షాపు యజమానిని విచారించగా అతనికి ఇందులో ప్రమేయం లేదని తేలింది. దాంతో కేసు దిశను డిస్ట్రిబ్యూటర్ వైపు మళ్లించారు. సదరు ఫోన్ మొదట ఎవరి వద్ద నుంచి వచ్చింది? ఎవరెవరి చేతులు మారింది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఫోన్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపారు. ఇది ఏదైనా నేర గ్యాంగ్‌ ద్వారా ఫేక్ ఐఎమ్ఈఐతో విక్రయించబడిందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఈ సంఘటన ఫోన్‌ కొనుగోలుపై వినియోగదారులు ఎంత జాగ్రత్త వహించాలో గుర్తు చేస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories