లండన్‌లో ఖమ్మం యువకుడు శ్రీహర్ష మిస్సింగ్ మిస్టరీ

లండన్‌లో ఖమ్మం యువకుడు శ్రీహర్ష మిస్సింగ్ మిస్టరీ
x
Highlights

లండన్‌లో అదృశ్యమైన ఖమ్మం యువకుడు మృతి చెంది ఉంటాడని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ కుమారుడు శ్రీహర్ష 12 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.

లండన్‌లో అదృశ్యమైన ఖమ్మం యువకుడు మృతి చెంది ఉంటాడని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ కుమారుడు శ్రీహర్ష 12 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. శ్రీహర్ష నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు అతడి స్నేహితులను,స్థానిక పోలీసులను సంప్రదించగా గాలింపు చేపట్టారు.లండన్‌లోని బీచ్‌ సమీపంలో శ్రీహర్షకు సంబంధించిన ల్యాప్‌టాప్‌ను గుర్తించారు. దీంతో బీచ్ పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ల సాయంతో పోలీసులు 12 రోజులుగా గాలింపు చేపడుతున్నారు.

ఈ విషయాన్ని యువకుడి తండ్రి ఉదయ్ ప్రతాప్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. కుమారుడి ఆచూకీ కోసం లండన్ వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు తెల్లవారుజామున శ్రీహర్ష అనవాళ్ళతో కూడిన ఓ మృతదేహాన్నీ సముద్రం నుండి వెలికితీసిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇవాళ మధ్యాహ్నం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తామని లండన్ పోలీసులు ప్రకటించారు. ఇన్నాళ్ళు తమ కుమారుడు క్షేమంగా ఉన్నాడని భావించిన కుటుంబ సభ్యులు పోలీసుల సమాచారంతో విషాదంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories