అత్తింటివారి దురాగతం.. ఏళ్లతరబడి ఆకలికి అల్లాడి మృతిచెందిన మహిళ..

అత్తింటివారి దురాగతం.. ఏళ్లతరబడి ఆకలికి అల్లాడి మృతిచెందిన మహిళ..
x
Highlights

అదనపు కట్న దాహానికి మరో మహిళ బలైంది. అదనపు కట్నం తేలేదన్న కోపంతో కడుపు మాడ్చి చంపిన అత్తింటివారి దురాగతం కేరళ రాష్ట్రం కొల్లాం సమీపంలోని కరునాగపల్లిలో...

అదనపు కట్న దాహానికి మరో మహిళ బలైంది. అదనపు కట్నం తేలేదన్న కోపంతో కడుపు మాడ్చి చంపిన అత్తింటివారి దురాగతం కేరళ రాష్ట్రం కొల్లాం సమీపంలోని కరునాగపల్లిలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన చెందిన తుషార(27)కు చందూలాల్‌ తో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఆమె తల్లిదండ్రులు కొంత డబ్బు చందూలాల్ కు ఇచ్చారు. అయితే అది చాలదని అత్తింటివారు తుషార వేధింపులకు గురిచేశారు. గత కొద్దిరోజులుగా ఆమెకు భోజనం పెట్టకుండా ఉన్నారు. దీంతో నానబెట్టిన బియ్యం, చక్కెర నీటితో కడుపు మంట తీర్చుకునేవారు. నెలల తరబడి ఆమెకు సరైన భోజనం లేకపోవడంతో ఆమె శరీరం ఎముకల గూడులా తయారైంది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న తుషారను స్థానికులు కొందరు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఈనెల 21న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుషార భర్త చందూలాల్‌, అత్త గీతాలాల్‌లను అరెస్టు చేశారు. ఆమె మరణానంతరం పోలీసుల దర్యాప్తులో అత్తింటి వారి హింస వెలుగులోకి వచ్చింది. తుషార శరీరంపై ఏమాత్రం కండరాలు లేవని, 20 కిలోల బరువుతో ఎముకల గూడులా మారినట్టు పోలీసులు గుర్తించారు.దీన్ని బట్టి చూస్తుంటే సంవత్సరాల తరబడి ఆమెను చిత్రహింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏడాదిన్నర కాలంగా తమ కుమార్తెను కలుసుకోనీయలేదని తుషార తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. తమ కుమార్తెను ఎంతగా హింసించినా, ఆమె జీవితం ఇబ్బందిలో పడుతుందనే భయంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వాపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories