ఆస్తికోసం కుటుంబ సభ్యులనే హతమార్చిన కిలేడి

ఆస్తికోసం కుటుంబ సభ్యులనే హతమార్చిన కిలేడి
x
Highlights

ఆస్తికోసం కుటుంబ సభ్యులనే హతమార్చిన కిలేడి ఆస్తికోసం కుటుంబ సభ్యులనే హతమార్చిన కిలేడి

కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో 2002 నుంచి 2016 వరకూ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల హత్యకు గురైన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజగా ఈ కేసు మిస్టరీని కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఛేదించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఈ ఆరుగురు వ్యక్తుల హత్య వెనుక భారీ కుట్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కుట్రను బహిర్గతం చేశారు. ఆస్తి కోసం మహిళ ఆమె రెండో భర్తే ఆ ఘాతుకానికి పాల్పడ్డట్టు విచారణలో తేలింది. ఆస్తిపై కన్నేసి 14ఏళ్లలో ఒకరి తర్వాత ఒకరిని అంతమొందించిన కోడలు జోలీ, ఆమె రెండో భర్త షాజుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2002లో రిటైర్డ్‌ టీచర్‌, జోలీ అత్త అన్మమ్మ థామస్‌ చనిపోయినప్పుడు ఆమె సహజంగానే మరణించినట్టు కుటుంబం భావించింది. ఆరేళ్ల తర్వాత ఆమె(నిందితురాలు మామ) భర్త టామ్‌ థామస్‌ (66) హార్ట్‌ఎటాక్ తో మరణించారు. ఆ తరువాత 2011లో వారి కుమారుడు, జోలీ మొదటి భర్త రాయ్‌ థామస్‌(40) గుండెపోటుతోనే కన్నుమూశారు. అయితే అటాప్సీ రిపోర్ట్‌లో ఆయన మరణానికి ముందు విషప్రయోగం జరిగిందని వెల్లడైంది. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే 2014లో అన్మమ్మ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్‌ (67) కూడా గుండెపోటుతో మరణించాడు, అలాగే 2016లో వారి బంధువుల కుమార్తె రెండేళ్ల అల్ఫాన్సా కూడా గుండె పోటుతోనే మరణించగా నెలల వ్యవధిలోనే ఆమె తల్లి సిల్లీ (27) కూడా కన్నుమూసింది.

అయితే వీరి మరణం సాధారణం కాదని పోలీసులకు అర్ధమైంది. ఈ క్రమంలో ఏళ్ల తరబడి విచారణ చేస్తున్నారు. పకడ్బందీ వ్యూహంతో నిందితురాలు జోలీ, ఆమె రెండో భర్త షాజు ఈ హత్యలను చాకచక్యంగా డీల్‌ చేసినట్టు కనిపెట్టారు. సిల్లీ భర్త షాజును పెళ్లాడిన జోలీ కుటుంబ ఆస్తిని తమ పేరున రాయాలని మామ టామ్‌పై ఒత్తిడి చేసి ఆస్తిని బదలాయించుకుంది. అమెరికాలో స్థిరపడిన టామ్‌ చిన్న కుమారుడు మోజో ఆస్తి బదలాయింపును సవాల్‌ చేశాడు. వరుస మరణాలపై కూడా క్రైమ్‌ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. దీంతో సైనేడ్‌ను వాడి వారి ప్రాణాలు తీసినట్టు పోలీసులు నిగ్గుతేల్చారు. దీంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో ఈ ఘటన కలకలం రేపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories