Top
logo

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌
Highlights

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడుతున్న ముగ్గురు కొత్తగూడెం జిల్లా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు....

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడుతున్న ముగ్గురు కొత్తగూడెం జిల్లా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా కొత్తగూడెం ప్రాంతాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడే వ్యక్తులపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా కొత్తగూడెం టూ టౌన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లకు కొంతమంది పాల్పడుతూ అమాయకులను మోసగిస్తున్న కడారి వేణుగోపాల్, దేవేందర్‌సింగ్, శ్రీరాములు విశ్వనాథ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి మూడు సెల్‌పోన్లు, రూ.24 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బు సంపాదించాలనే అత్యాశతో వీరు బెట్టింగులకు పాల్పడుతున్నారు. వీరు సెల్‌ఫోన్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని నెట్‌ పాయింట్‌ ద్వారా టీమ్‌లో టాప్‌గా ఉన్న టీమ్‌ను అంచనా వేసుకొని బాల్‌ టూ బాల్, ఓవర్‌ టూ ఓవర్, మ్యాచ్‌ టూ మ్యాచ్‌ను బట్టి టీమ్‌ ప్లేయర్‌ను బట్టి ప్లేయర్‌ మీద రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు.

Next Story


లైవ్ టీవి