పెంపుడు మొసలి చేతిలో బలైన మహిళ

పెంపుడు మొసలి చేతిలో బలైన మహిళ
x
Highlights

ఏళ్లతరబడి పెంచుకుంటున్న పెంపుడు మొసలి చేతిలోనే మహిళ బలైంది. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. జకార్తాకు చెందిన 44 ఏళ్ల మహిళా సైంటిస్ట్‌ తన ఇంటిలోనే వాటర్...

ఏళ్లతరబడి పెంచుకుంటున్న పెంపుడు మొసలి చేతిలోనే మహిళ బలైంది. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. జకార్తాకు చెందిన 44 ఏళ్ల మహిళా సైంటిస్ట్‌ తన ఇంటిలోనే వాటర్ పూల్ ను ఏర్పాటు చేసింది. అందులో ఓ మొసలిని తెచ్చి వదిలింది. ప్రస్తుతం దాని పొడవు 14 అడుగులు. ఆడించడం తోపాటుగా చేపలు ఇతర జంతువుల మాంసం రోజు దానికి ఆహారంగా వేసేది. ఇలా ఎంత బాగా చూసుకున్నప్పటికి దాని అసలు స్వభావం మారలేదు. పాలు పోసి పెంచిన చేతినే కాటేసిందన్నట్లు ఆ మొసలి యజమానురాలిపై దాడి చేసి క్రూరంగా గాయపరిచింది. ఒకానొక సమయంలో సదరు మహిళను ఆ మొసలి మింగేసే ప్రయత్నం చేసింది. అయితే అనూహ్యంగా ఆమె తోటి ఉద్యోగులు రావడంతో రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందింది. ఆ మొసలి సదరు మహిళ మీద దాడి చేసి ఒక చేతిని పూర్తిగా తినేయడమే కాక.. ఉదర భాగాన్ని కూడా తీవ్రంగా గాయపరిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories