స్నేహితుడి భార్య తో అక్రమ సంబంధం.. అదేమని అడిగినందుకు హత్య!

స్నేహితుడి భార్య తో అక్రమ సంబంధం.. అదేమని అడిగినందుకు హత్య!
x
Highlights

బాల్య స్నేహితుడినే దారుణంగా వంచించాడు ఒక వ్యక్తి. తన స్నేహితుడి భార్యను తనతో తీసుకుపోయి.. ఆ అన్యాయాన్ని నిలదీశాడని అదే స్నేహితుడిని దుర్మార్గంగా హత మార్చాడు.

బాల్య స్నేహితుడినే దారుణంగా వంచించాడు ఒక వ్యక్తి. తన స్నేహితుడి భార్యను తనతో తీసుకుపోయి.. ఆ అన్యాయాన్ని నిలదీశాడని అదే స్నేహితుడిని దుర్మార్గంగా హత మార్చాడు.

కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని ఓ గ్రామంలో మునియప్ప, రమేష్ ఇద్దరూ చిన్నప్పటినుంచి స్నేహితులు. రమేష్ కి వివాహమైనా వారిద్దరి మధ్య స్నేహం తగ్గలేదు. తరచు ఇద్దరూ రమేష్ ఇంటిలోనే కలుస్తుండేవారు.

ఈ క్రమంలో రమేష్ భార్య కళావతితో మునియప్ప అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. రమేష్ లేని సమయంలో ఈ ఇద్దరూ తరుచు వారి ఇంట్లోనే కలుస్తుండేవారు. ఇది మరింత ముదిరిపోయి కళావతి తన భర్తను వదులుకోవడానికి సిద్ధపడింది. దీంతో సంవత్సరం క్రితం ఈ ఇద్దరూ కల్సి ఊరు విడిచి వెళ్ళిపోయారు. రమేష్ భార్య కోసం ఎంతో వెతికాడు కానీ, లాభం లేకపోయింది. కొంత కాలం తరువాత మునియప్ప ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ కళావతి మాత్రం తాన భర్త రమేష్ వద్దకు రావడానికి నిరాకరించింది. దీంతో పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. అయినా కళావతి భర్త వద్దకు రానని తెగేసి చెప్పడమే కాకుండా తనకు విడాకులు కావాలని కోరింది. అంతే కాకుండా కోర్టులో విడాకులకు దరఖాసు కూడా చేసుకుంది.

దీంతో గ్రామంలో మంగళవారం మునియప్పతో ఘర్షణ పడ్డాడు రమేష్. తాన భార్యను దూరం చేసావని కొట్టాడు. దాంతో ఆగ్రహించిన మునియప్ప రమేష్ పై తన తుపాకీతో కాల్పులు జరిపాడు. తుపాకీ దెబ్బకు గాయాలపాలైన రమేష్ ను

సమీపంలోని ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మరణించాడు. రమేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల మునియప్ప, అతడి తండ్రి, కళావతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories