Hyderabad :వనస్థలిపురం అపార్ట్మెంట్లో కత్తి దాడి.. మహిళను నరికి చంపిన మాజీ భర్త


Hyderabad :వనస్థలిపురం అపార్ట్మెంట్లో కత్తి దాడి.. మహిళను నరికి చంపిన మాజీ భర్త
వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో మహిళ హత్య. మాజీ భర్త కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం.
Hyderabad నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. వనస్థలిపురం ప్రాంతంలోని గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్మెంట్లో ఓ మహిళను కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు కత్తి మరియు పెట్రోల్ డబ్బాతో అక్కడికి చేరుకుని దాడికి పాల్పడ్డాడు.
ఘటన సమయంలో ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ బెదిరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతురాలితో గతంలో తనకు వివాహం జరిగిందని, ప్రస్తుతం ఆమె రెండో పెళ్లి చేసుకుందని నిందితుడు చెప్పినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



