చైన్ స్నాచర్లను చేధించిన పోలీసులు..

చైన్ స్నాచర్లను చేధించిన పోలీసులు..
x
Highlights

గత నెలలో హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన స్నాచింగ్‌ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు సభ్యులు గల ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన స్నాచర్స్‌ను మొత్తానికి మీడియా ముందుకు తీసుకొచ్చారు.

గత నెలలో హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన స్నాచింగ్‌ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు సభ్యులు గల ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన స్నాచర్స్‌ను మొత్తానికి మీడియా ముందుకు తీసుకొచ్చారు. వారి నుంచి 25 గ్రాముల బంగారం, రెండు బైక్‌లు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 15 గంటల్లో 11 చైన్‌ స్నాచింగ్‌లు. గత నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో జరిగిన ఈ ఘటనలతో యావత్‌ రాష్ట్రం ఉలిక్కిపడింది.

ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకుని మూల మలుపుల్లో దాడి చేసి బంగారు చైన్లను దొంగలించారు. బైక్‌పై ప్రయాణిస్తూ వనస్థలిపురం, హయత్ నగర్, మీర్పేట్ లో బంగారు ఆభరణాలను లాక్కెళ్లిపోయారు. గంటల వ్యవధిలోనే కలకలం రేపిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఏకంగా 120 టీమ్‌లు ఏర్పడి తనిఖీలు చేపట్టారు. 600 సీసీకెమెరాల ఫుటేజ్ ను మానిటరింగ్ చేసి అనెలైజ్ చేశారు. అంతేకాకుండా వివిధ ట్రావెల్స్ ఎజెన్సీలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేన్లలు, 2 వేల కు పైగా లాడ్జ్ లలో సెర్చ్ ఆపరేషన్లను కండక్ట్ చేశారు. ఎట్టకేలకు ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

మొత్తానికి మోను, చాక, ప్రణీత్‌ చౌదరి అని ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. గతంలో జైల్లో ఉన్నప్పుడే ఈ ముగ్గురు కలిశారని అప్పటి నుంచి మెరుపు వేగంతో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారని తెలిపారు. ప్రణీత్‌ ఒక్కడు హైదరాబాద్‌కు చెందిన వాడని మిగతా ఇద్దరు యూపీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. స్నాచింగ్‌ ఘటనలకు ప్రణీత్‌ సూత్రదారిగా వ్యవహరించాడని.. వివరించారు. సీసీ కెమెరాలు లేని, ఎస్కేప్‌ అవ్వడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను సెలక్ట్‌ చేసి మరీ స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురి నుంచి 25 గ్రాముల బంగారు అభరణాలు, కేటీమ్, పల్సర్ బైక్‌లు, ఓ కత్తి స్వాధీనం చేసుకున్నారు. కేటీమ్ బైక్ ను ఓఎల్ ఎక్స్ లో అద్దెకు తీసుకుని రెక్కీ నిర్వహించారని తర్వాత చైన్ స్నాచింగ్లకు దిగినట్టు తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వీరికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories