Hyderabad Amberpet Tragedy: అంబర్‌పేటలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Hyderabad Amberpet Tragedy
x

Hyderabad Amberpet Tragedy: అంబర్‌పేటలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Highlights

Hyderabad Amberpet Tragedy: హైదరాబాద్ అంబర్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Hyderabad Amberpet Tragedy: నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతులను రామరాజు (55), మాధవి (50), శశాంక్ (25)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆర్థిక సమస్యల కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ ఘటనతో అంబర్‌పేట ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories