టచ్‌ ఫోన్‌ కొనివ్వలేదని.. భార్యను సిగరెట్లతో కాల్చి..

టచ్‌ ఫోన్‌ కొనివ్వలేదని.. భార్యను సిగరెట్లతో కాల్చి..
x
Highlights

కేవలం రూ. 5 రూపాయల టన్ ఫోన్ కొనివ్వలేదని పదిరోజులుగా నరకం చూపిస్తూ.. ఒళ్లంతా సిగరెట్లతో కాల్చి.. కట్టుకున్న భార్యనే అతి దారుణంగా హత్యచేశాడు భర్త. సెల్...

కేవలం రూ. 5 రూపాయల టన్ ఫోన్ కొనివ్వలేదని పదిరోజులుగా నరకం చూపిస్తూ.. ఒళ్లంతా సిగరెట్లతో కాల్చి.. కట్టుకున్న భార్యనే అతి దారుణంగా హత్యచేశాడు భర్త. సెల్ ఫోన్ తో పాటు అదనపు కట్నం తీసుకురావాలని వేధించాడు. శుక్రవారం ఇదే విషయంపై గోడవపడి ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఇంట్లోనే కుప్పకూలిపోవడంతో భార్య చనిపోయిందని శవాన్ని గదిలోనే వేసిపారిపోయాడు. శనివారం స్థానికులు, బంధువులు వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో శవమై పడివుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ సూర్యనారాయన ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. ఇక డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన చాందిని (22)కి అదే ప్రాంతానికి చెందిన మారుతీతో కొంత కాలం క్రితం పెళ్లైంది. అయితే వివాహ సమయంలో కట్నకానుకల కింద అతడికి రూ.4 లక్షలు ఇచ్చారు. మారుతీ దుకాణాల వద్దకు వెళ్లి సాంబ్రాని వేసి కాలం వెల్లదీసేవాడు. వీరికి వల్లీ (4) అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం చాందిని రెండు నెలల గర్భవతి.

కాగా పెళ్లైనప్పటి నుంచి అధిక కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. అయితే ప్రతి నెలా పుట్టింటి నుండి ఎంతో కొంత డబ్బు తీసుకుని రావాలని భార్యను హెచ్చరించేవాడు. అయితే పది రోజుల నుంచి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. భర్తతో పాటు అత్తా, మామ, ఆడ బిడ్డ కూడా చిత్రహింసలకు గురిచేసేవారు. కాగా కొద్ది రోజుల కిందట తనకు టచ్‌ ఫోన్‌ కావాలని భార్యను అడిగాడు. దినికి చాందిని సమాధానం ఇస్తూ తొందరలోనే అమ్మను డబ్బులు అడిగి కొనిస్తానని భార్య చెప్పిందని డీఎస్పీ తెలిపారు. నేను అడినా వెంటనే సెల్ కొనివ్వలేదని మనసులో పెట్టుకున్న మారుతీ శుక్రవారం రాత్రి భార్యను తీవ్రస్థాయిలో కొట్టడంతో పాటు కత్తితో ఒంటిపై గాయపరిచాడు.. దెబ్బలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియకా శవాన్ని గదిలో పెట్టి భర్త, అత్తా, మామ, ఆడబిడ్డ ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరార్ అయ్యారు. విషయం తెలుసుకున్న చాందీని తలిదండ్రులు కన్నీరు మున్నిరయ్యారు. మృతురాలి తల్లి ఖాసింబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తా, మామ, ఆడబిడ్డపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories