Top
logo

సూర్యాపేట జిల్లాలో దారుణం .. పిల్లల ముందే భార్యపై ...

సూర్యాపేట జిల్లాలో దారుణం ..  పిల్లల ముందే భార్యపై ...
X
Highlights

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న ఇల్లాలునే కీరాతకంగా కడతేర్చాడు దుర్మాగ్గుడు. జిల్లాలోని మునగాల మండలం కలకోవ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం చెప్పిన వివరాల ప్రకారం... కలకోవ గ్రామానికి చెందిన భూలక్ష్మీకి శ్రీనుకు 19ఏళ్ల క్రితం వివాహమైంది.

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న ఇల్లాలునే కీరాతకంగా కడతేర్చాడు దుర్మాగ్గుడు. జిల్లాలోని మునగాల మండలం కలకోవ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం చెప్పిన వివరాల ప్రకారం... కలకోవ గ్రామానికి చెందిన భూలక్ష్మీకి శ్రీనుకు 19ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీను దంపతులకు ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. శ్రీను మద్యానికి బానిసై కుటుంబాన్ని భార్య బిడ్డలను వేధించసాగాడు. దీంతో భూలక్ష్మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పదేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఆతర్వాత శ్రీను కూడా అక్కడకు వెళ్లి వారితోనే ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో కొన్ని రోజులు బాగానే ఉన్న శ్రీను మళ్లీ మద్యం తాగొచ్చి భూలక్ష్మీని వేధించడం మొదలు పెట్టాడు. ఇదే క్రమంలో సోమవారం మద్యం మత్తులో ఉన్న శ్రీను భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో గొడలితో భూలక్ష్మీపై కీరాతకంగా దాడి చేసి పరారైయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భూలక్ష్మీని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. భూలక్ష్మీ పరిస్థితి చూసి ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీను పిల్లల ఇంట్లో ఉన్న సమయంలో భార్యపై దాడి చేసినట్లు తెలుస్తోంది. పిల్లలు మాత్రం తండ్రి శ్రీను గత 10 రోజులుగా భూలక్ష్మీపై చంపేస్తానని బెరించాడని అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story