Top
logo

ఈజీ మనీ కోసం.. అమ్మాయిలు అంతా కలిసి ఏం చేస్తున్నారంటే..?

ఈజీ మనీ కోసం.. అమ్మాయిలు అంతా కలిసి ఏం చేస్తున్నారంటే..?
X
Highlights

చదువుకునే అమ్మాయిలు వ్యాసనాలకు బానిసై డబ్బుకోసం అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా బుక్కయిన ఘటన మధ్యప్రదేశ్‌లో...

చదువుకునే అమ్మాయిలు వ్యాసనాలకు బానిసై డబ్బుకోసం అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా బుక్కయిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే నిందితులంతా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పట్టణంలో ఓ కళాశాలలో చదువుకుంటున్నారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకుందామని ఇక్కడికి వచ్చారు. అయితే ఈజీగా డబ్బు సంపాదించాలనే దురలోచనతో వ్యభిచార రంగంలోకి ప్రవేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పొందాలనే ఆశతో హైటెక్ వ్యభిచార ముఠాగా ఏర్పడి, విటులను ఆకర్షించడం మొదలు పెట్టారు. అయితే వీరంతా డ్రగ్స్‌కి బానిస కావడం వల్లే డబ్బుకోసం ఇలా అడ్డదారులు తొక్కి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే భోపాల్ పట్టణంలోఈ గ్యాంగ్ అంతా కలిసి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. కాగా వీరందరూ కలిసి కంబైన్డ్ స్టడీస్ చేసుకుంటామని ఫ్లాట్ లో స్ధిరపడ్డారు. ఇక పనిలో పనికి మొదట తమకు తెలిసిన వారితో వ్యభిచారం మొదలుపెట్టారు. ఇక మొళ్లిగా బిజినెస్ డెవలప్ మెంట్ చేసుకోవడం కోసం ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ తమ ఫ్లాట్‌కు రప్పించే పని పెట్టుకున్నారు. అయితే తరచూ తమ ఫ్లాట్‌లో కొత్త వ్యక్తులు వస్తుపోతుడటం గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు యువతుల అసలు గుట్టు బయటపడింది. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని రీహాబిలేషన్ సెంటర్ కు తరలించారు.

Next Story