సినీ హీరో కారు ఢీకొని మహిళ మృతి

సినీ హీరో కారు ఢీకొని మహిళ మృతి
x
Highlights

సినీనటుడు సుధాకర్‌ కోమాకుల కారు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది. ఈ...

సినీనటుడు సుధాకర్‌ కోమాకుల కారు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు జాతీయ రహదారిపై శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న సుధాకర్‌ కోమాకులతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన సుధాకర్ కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

సుధాకర్‌ తన కొత్త సినిమా ''నువ్వు తోపురా'' ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్‌ నిత్యాషెట్టితో కలిసి గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలకు కారులో వెళ్తున్నాడు. మరికొద్ది సేపట్లో గుంటూరు చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది. కాగా మృతురాలికి భర్త.. తమకు పుట్టిన కుమారుడితో పాటు మరో అనాథను లక్ష్మి పెంచుతోంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories