Top
logo

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు..

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు..
Highlights

అమెరికాలో మరోసారి కాల్పులతో కలకలం రేపింది.

అమెరికాలో మరోసారి కాల్పులతో కలకలం రేపింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు జరిపిన జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలిక మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నగరంలో ఉన్న సోల్డన్‌ హైస్కూల్‌ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక మీడియాల కథనం ప్రకారం.. బాలిక తన కుటుంబంతో కలిసి పుట్‌బాల్‌ ఈవెంట్‌కు వచ్చింది. అయితే అదే సమయంలో దుండగుడు ఒక్కసారిగా కాల్పులుకు జరిపాడు. దీంతో బాలికతో పాటు ఇద్దరు టీనేజర్లు, 40 ఏళ్ల మహిళ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులకు గల కారణం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story


లైవ్ టీవి