షార్ట్స్ ఎందుకు వేసుకున్నావ్... సంప్రదాయం కాదు యువతితో వ్యక్తి వాదన

షార్ట్స్ ఎందుకు వేసుకున్నావ్... సంప్రదాయం కాదు యువతితో వ్యక్తి వాదన
x
Highlights

ఓ యువతి ధరించిన దస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమర్యాదగా ప్రవర్తించాడు ఓ వక్తి. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవహనంపై వెళ్తుంది. ఈ క్రమంలో వారిని ఉద్దేశించి ఓ వాహనదారుడు కామెంట్ చేశాడు.

ఓ యువతి ధరించిన దస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమర్యాదగా ప్రవర్తించాడు ఓ వక్తి. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవహనంపై వెళ్తుంది. ఈ క్రమంలో వారిని ఉద్దేశించి ఓ వాహనదారుడు కామెంట్ చేశాడు. దీంతో బైక్ నిలిపి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆ యువకుడు ఆమెతో పాటుగా ఉన్న ఆమె స్నేహితుడితో వాదనకు దిగాడు. సంప్రదాయ దుస్తువులు ధరించాలని కురచ దుస్తువులు ధరించడం భారత సంప్రదాయం కాదని గొడవకు దిగాడు. అయితే వీడియో చిత్రికరిస్తుండడం గమనించి వ్యక్తి వెనక్కి తగ్గి.. ఆవే హితోపదేశాలు చేస్తున్నాడు. సంప్రదాయన్ని పాటించాలని, సభ్యత లేకుండా షార్ట్స్ ఎందుకు ధరించాలని నిలదీశాడు. దీంతో ఆ యువతి తన పట్ల అమర్యాదగా మాట్లాడడం ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఆవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలోను హైదరాబాద్‌లోని కాలేజీ అమ్మాయిలకు రూల్స్ పెట్టింది. మోకాళ్లు కిందకు కవర్ చేస్తూ డ్రెస్ ధరించాలని ,షార్ట్స్, స్లీవ్‌ లెస్ ధరించడంపై నిషేధం విధించారు. మహిళల సాధికారత అంటూనే కాలేజ్ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయంపై మహిళలు అభ్యంతం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories