Top
logo

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి..

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి..
X
Highlights

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గరిడేపల్లి మండల కేంద్రంలో లారీ అదుపు తప్పి నలుగురిపై...

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గరిడేపల్లి మండల కేంద్రంలో లారీ అదుపు తప్పి నలుగురిపై దూసుకెళ్లింది. దాంతో నలుగురు మృత్యువాత పడ్డారు. గరిడేపల్లిలో చామకూరి అనిల్ అనే వ్యక్తి ఇంట్లో

వేడుక జరుగుతోంది. ఈ క్రమంలో ఇంట్లోని వ్యక్తులు పుట్ట బంగారం తీసుకుని వస్తుండగా అదుపుతప్పిన లారీ ఒక్కసారిగా నలుగురిపై వీరిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిలో మర్రి ధనమ్మ, వెంకమ్మ, మట్టమ్మలతో పాటు 19 ఏండ్ల యువతి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story