ఆ కోడి ఎంత పని చేసింది..?

ఆ కోడి ఎంత పని చేసింది..?
x
Highlights

విజయనగరం జిల్లా బొద్దిడిలో దారుణ జరిగింది. కోడి కోసం తండ్రి కొడుకు మధ్య గొడవ చివరకు హత్యగా మారింది. కోడి కోసం తండ్రి చేతిలోనే కొడుకు హత్య జరిగింది....

విజయనగరం జిల్లా బొద్దిడిలో దారుణ జరిగింది. కోడి కోసం తండ్రి కొడుకు మధ్య గొడవ చివరకు హత్యగా మారింది. కోడి కోసం తండ్రి చేతిలోనే కొడుకు హత్య జరిగింది. గ్రామంలో నివశించే అడ్డాకుల మద్దేశ్వరరావు (22) అనే యువకుడికి కోళ్ళు అంటే చాలా ఇష్టం. మద్దేశ్వరరావు ఇంటి పెరట్లో తనకిష్టమైన ఓ జాతి కోడిని పెంచుకుంటున్నాడు. అయితే అతడి తండ్రి కాంతారావు..సదరు కోడిని తీసుకెళ్లి గ్రామ శివారులోని చెరువులో ముంచడంతో అది ఊపిరాడక మృత్యువాతపడింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మద్దేశ్వరావుకి కోడి కనిపించలేదు.

ఆ సమయం లో కోడి కన్పించక పోవటంతో కొడుకుతో గొడవ పడ్డాడు. దీంతో తండ్రి కొడుకు లు ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. తండ్రికి పిచ్చి కోపం వచ్చింది. ఆయన పక్కనే ఓ కత్తి తీస్కొని వెంటనే దాన్ని పట్టుకొని కొడుకు ఛాతి పై కత్తి తో దాడి చేసాడు. దీంతో మద్దేశ్వరరావు సొమ్మసిల్లిపోయాడు, వెంటనే కుటుంబసభ్యులు అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు... అయితే ఎక్కువ రక్త స్రావం కావటంతో అతను మార్గమధ్యలోనే మరణించాడు. మద్దేశ్వరరావు మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాంతారావు ఘటన జరిగిన తరువాత అక్కడినుండి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories