Road Accident: ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం,బస్సును ఢీకొన్న ట్యాంకర్, 18 మంది మృతి

Road Accident: ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఉన్నావ్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సును పాల ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతిచెందారు.

Dhivi
Published on: 10 July 2024 8:14 AM IST
Fatal accident on Agra-Lucknow Expressway, tanker collides with bus, 18 killed
X

Road Accident: ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం,బస్సును ఢీకొన్న ట్యాంకర్, 18 మంది మృతి

Road Accident:ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. బీహార్‌లోని సీతామర్హి నుండి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు తెల్లవారుజామున పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 30 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంతో ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టి ముందు వైపుకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.


Dhivi

Dhivi

Next Story