Top
logo

విజయవాడలో విషాదం.. మూకుమ్మడి ఆత్మహత్యలు

విజయవాడలో విషాదం.. మూకుమ్మడి ఆత్మహత్యలు
X
Highlights

విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవటంతో కలకలం రేగింది.

విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవటంతో కలకలం రేగింది. రాయవేలూరుకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ ధనశేఖర్‌ భార్య జయంతి, కుమార్తె శ్రీలక్ష్మీ, పెదనాన్న గోపాల కృష్ణన్‌లు విజయవాడలో రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. గత నెల 27న తన ఇద్దరు కుమార్తెలతో పాటు తాతయ్య వరుసైన గోపాల కృష్ణన్‌తో జయంతి వేళాంగిణి మాత గుడికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. జయంతి పెద్ద కూతురు మహాలక్ష్మి వేళాంగిణి మాత ఆలయంలోని అతిధి గృహంలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. జయంతి భర్త, ఇతర కుటుంబసభ్యులు గోపాలకృష్టన్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story