సుప్రీం కోర్టులో మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి కి ఉరట

సుప్రీం కోర్టులో మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి కి ఉరట
x
Highlights

షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి నిర్దోషి అంటూ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.1990 డిసెంబర్ 5వ తేదీన...

షాద్ నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి నిర్దోషి అంటూ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.

1990 డిసెంబర్ 5వ తేదీన ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ బస్టాండ్‌లో అప్పటి కాంగ్రెస్ నేతలు దేవగుడి శివశంకర్ రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలను ప్రత్యర్థులు హత్య చేశారు. హత్యకు గురైన వారు జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చిన్నాన్న.

ఈ కేసులో గతంలో హైకోర్ట్ రామ సుబ్బారెడ్డిని నిర్దోషిగా తీర్పిచ్చింది. దీంతో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై సుప్రీం కోర్టు రామ సుబ్బారెడ్డి కి ప్రస్తుతం క్లీన్ చిట్ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories