Top
logo

సానా సతీష్‌ కేసులో కీలక మలుపు

సానా సతీష్‌ కేసులో కీలక మలుపు
Highlights

సానా సతీష్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో ఉన్న లింకులపై సానా సతీష్‌ సమాచారం...

సానా సతీష్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో ఉన్న లింకులపై సానా సతీష్‌ సమాచారం ఇచ్చారు. సతీష్‌తో సంబంధం ఉన్న తెలుగు ప్రముఖులకు నోటీసులు అందించింది. అయితే లిస్ట్‌లో ఉన్న షబ్బీర్‌అలీ, సుఖేగుప్తా, రమేష్‌, చాముండికి ఈడీ నోటీసులు జారీ చేశారు. సానా సతీష్‌ కేసులో కీలక సమాచారాన్ని ఈడీ రాబట్టింది. అయితే గత 2013లో సుఖేష్‌ గుప్తా బెయిల్‌ కోసం మాంసం వ్యాపారీ మొయిన్‌ ఖురేషీకి సానా రూ. కోటీ 50లక్షలు ఇచ్చారని కేసు నమోదయింది.

సాన సతీష్ ఇచ్చిన సమాచారంతో తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందంటూ జరుగుతున్న ప్రచారం అంతా బూటకమంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. ఒక వేళ విచారణకు రమ్మని పిలిచినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. మాంసం వ్యాపారి ఖురేషీ తనకు ప్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు షబ్బీర్ అలీ.

Next Story


లైవ్ టీవి