Top
logo

ముసద్దీలాల్‌ జ్యూవెలరీ షాపులో మరోసారి ఈడీ సోదాలు

ముసద్దీలాల్‌ జ్యూవెలరీ షాపులో మరోసారి ఈడీ సోదాలు
X
Highlights

పెద్దనోట్ల రద్దు సమయంలో ముసద్దీలాల్ జ్యూవెలర్స్.. నకిలీ బిల్లులు సృష్టించి 110 కోట్ల రూపాయలను మనీగా...

పెద్దనోట్ల రద్దు సమయంలో ముసద్దీలాల్ జ్యూవెలర్స్.. నకిలీ బిల్లులు సృష్టించి 110 కోట్ల రూపాయలను మనీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ వేసి అనూహ్యంగా ఈడీ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు మొత్తం రూ. 110.85 కోట్ల గోల్‌మాల్‌కు సంబంధించి చార్జిషీట్‌ దాఖలు చేసింది. అప్పట్లో వారి అకౌంట్‌లో ఒకేసారి 110 కోట్లు డిపాజిట్ కావడంతో ఐటి అధికారుకు అనుమానం వచ్చింది.

ఐటీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు రాత్రికి రాత్రే 5200 మంది నుంచి 110 కోట్ల రూపాయలైన నగదును స్వీకరించి తమ ఖాతాలోకి మళ్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. దీంతో ఈ సంస్థ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ముసద్దీలాల్‌తోపాటు దాని అనుబంధ సంస్థలు, కుంభకోణంతో ప్రమేయమున్న సంస్థలు, కైలాష్‌ గుప్తా సహా కొందరు యజమానుల ఇళ్లపై బుధ, గురువారాల్లో వరుస దాడులు చేసింది. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలోని ముసద్దీలాల్‌ కార్యాలయంలో తనిఖీలు చేశారు. 82 కోట్ల రూపాయల విలువైన 145 కిలోల బంగారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది.

Next Story