Top
logo

అమ్మ చెంతకు జషిత్

అమ్మ చెంతకు జషిత్
X
Highlights

ఆ తల్లికి నాలుగురోజులుగా కంటి మీద కునుకు లేదు. నాలుగేళ్ల తమ చిన్నారి ఏమైపోయాడో తెలీని స్థితిలో కన్నీరు...

ఆ తల్లికి నాలుగురోజులుగా కంటి మీద కునుకు లేదు. నాలుగేళ్ల తమ చిన్నారి ఏమైపోయాడో తెలీని స్థితిలో కన్నీరు మున్నీరవుతోంది. నాలుగురోజుల నరకం తరువాత ఆమె మోములో ఆనందం తాండవించింది. తన ముద్దుల కొడుకు తన చెంతకు చేరగానే ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుదు జషిత్ కిద్నాప్ కథ సుఖాంతమయింది. ఈ తెల్లవారుజామున బాలుడు రాయవరం మండలం కుతుకులూరులో స్థానికులకు కనిపించడంతో, వారు అతనిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని జషిత్ ను తీసుకువచ్చారు. తరువాత బాలుని అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. దీంతో జషిత్ తల్లి సంతోషంతో బిడ్డను అక్కున చేర్చుకుంది. తన బిడ్డను క్షేమంగా అప్పచెప్పిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

కిడ్నాపైన నాలుగేళ్ల జషిత్‌ను జిల్లా ఎస్పీ నయీం అస్మి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుడిని ఆగంతుకులు రాయవరం మండలం కుతుకులూరులో విడిచిపెట్టి వెళ్లినట్లు సమాచారం తెలియడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లి బాలుడిని తీసుకొచ్చారని ఎస్పీ తెలిపారు. బాబు క్షేమంగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. బాలుడిని గుర్తించడంలో సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. వ్యక్తిగత కారణాలే బాలుడి అపహరణకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.


Next Story