వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు తీసి ... ఆపై

వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు తీసి ... ఆపై
x
Highlights

ఓ వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు చిత్రీకరించి డబ్బు డిమాండ్ చేశాడు ఓ దుర్మాగుడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తపేటకు చెందిన వెంకటనాగ సాయికృష్ణ అనే యువకుడు తన పక్క వీధిలో ఉండే వివాహితపై కన్నేశాడు.

ఓ వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు చిత్రీకరించి డబ్బు డిమాండ్ చేశాడు ఓ దుర్మాగుడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తపేటకు చెందిన వెంకటనాగ సాయికృష్ణ అనే యువకుడు తన పక్క వీధిలో ఉండే వివాహితపై కన్నేశాడు. గత కొన్ని రోజులుగా అసభ్యకరమైన చేష్టలతో, చూపులతో ఆమెను వేధింపులకు గురిచేశాడు. కొద్దీ రోజుల పాటు అతని చేష్టలు భరించిన ఆమె చివరికి సాయికృష్ణపై భర్తకు చెప్పింది.

ఆమె భర్త సాయికృష్ణను హెచ్చరించాడు. దీంతో మరింత కక్ష్య పెంచుకున్న సాయికృష్ణ , ఆ వివాహితపై పంతం పెంచుకుని ఆమె స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో వీడియోలు తీశాడు. మరునాటి నుంచి ఆ వీడియోలను ఆమెకు చూపించి లొంగతీసుకోవాలని చూశాడు. లేదా వీడియోలను అశ్లీల మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో ఆమె అతన్ని ప్రాధేయపడింది. అయినా సాయి కృష్ణ కనికరించలేదు. చివరికి 5లక్షలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర డబ్బు లేదని ఆమె చెప్పినా పట్టించుకోలేదు.

దీంతో సాయికృష్ణ వేధింపులు తాళలేక బాధితురాలు ఆమె భర్తకు అసలు విషయం చెప్పింది. సాయికృష్ణపై కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని,‎దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందుతుడు సాయికృష్ణ పరారీలో ఉన్నాడని అతన్ని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories