Top
logo

మందుబాబులకు మూడ్రోజుల నుంచి 25రోజుల జైలుశిక్ష

మందుబాబులకు మూడ్రోజుల నుంచి 25రోజుల జైలుశిక్ష
X
Highlights

డిసెంబర్ 31 రోజు మందు తాగి వాహనాలు నడిపిన మందుబాబులకు జైలు శిక్ష పడింది. డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడ్డ 405 మందికి ...

డిసెంబర్ 31 రోజు మందు తాగి వాహనాలు నడిపిన మందుబాబులకు జైలు శిక్ష పడింది. డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడ్డ 405 మందికి కోర్టు మూడు రోజుల నుంచి 25రోజుల వరకు జైలుశిక్ష విధించింది. జైలు శిక్ష పడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

కొత్త సంవత్సరం సందర్బంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష పడింది. డిసెంబర్ 31 తేదీ సందర్భంగా పోలీసులు ముమ్మరంగా డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు వాహనదారులను తనిఖీలు చేశారు. పబ్ లు, బార్ లలో తప్పతాగి వాహనాలు నడుపుతూ వెళ్తున్న వారిని బ్రీత్ ఎనలైజర్ లతో మందుబాబుల పని పట్టారు. ఈ సందర్భంగా తనిఖీల సమయంలో కొందరు పోలీసులకు చుక్కలు చూపించారు.

పట్టుబడ్డ మందుబాబులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో 405మందికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. మాదాపూర్‌లో 147మందికి, గచ్చిబౌలిలో 72మందికి, మియాపూర్‌లో 56మందికి, కూకట్‌పల్లిలో 79మందికి, బాలానగర్‌‌లో 51మందికి జైలుశిక్ష పడింది. నేరం తీవ్రతను బట్టి ...పట్టుబడ్డ మందుబాబులకు మూడ్రోజుల నుంచి 25రోజుల వరకు జైలుశిక్ష విధించింది. జైలుశిక్ష పడ్డవాళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనివాళ్లకు ఐదు వందలు, మద్యం సేవించినవారికి వాహనం ఇచ్చినందుకు 5వేలు, మైనర్ డ్రైవర్స్‌కి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించింది.

Next Story