మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు శిక్ష..

డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్ (52)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. జైలు శిక్షతోపాటు రూ.42 వేల...
డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్ (52)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. జైలు శిక్షతోపాటు రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. బాలికపై అత్యాచారం కేసులో రాజ్‌కుమార్ నిందితుడిగా ఉన్నాడు. 2006లో పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజ్‌కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇతని ఇంట్లో పనికి చేరింది. దాంతో ఆమెపై రాజ్‌కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో కొద్ది రోజులకే ఆ బాలిక తన తల్లికి ఫోన్ చేసి తనను తీసుకెళ్లాలని కోరింది. ఆమెను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు బయలుదేరారు. ఇంతలో రాజ్‌కుమార్ స్నేహితుడు జయశంకర్ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు.
తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి బాలికను చూడగా ఆమె మరణించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. ఈ కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, పన్నీర్ సెల్వం సహా ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇన్ని రోజుల తరువాత ఈ కేసులో తీర్పు వెలువడింది. మాజీ ఎమ్మెల్యే ఎం.రాజ్‌కుమార్, ఆయనకు సహకరించిన స్నేహితుడు జయశంకర్ పై నేరం రుజువు కావడంతో వారికిపదేళ్ల జైలు శిక్ష, రూ. 42 వేల జరిమానా విధించారు.మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు శిక్ష..
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Liver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. అది లివర్...
25 Jun 2022 11:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMTసర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMT