Top
logo

హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం

హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం
X
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్‌ మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని పోలీస్ కమిషనర్ మహేష్‌...

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్‌ మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని పోలీస్ కమిషనర్ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. బాధితుల కుటుంబాలతో ఆయన చర్చలు జరిపారు. ఔట్‌సోర్సింగ్‌ ద్వారా బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వారు ఎప్పుడైనా ఉద్యోగంలో చేరవచ్చని. ఇప్పటికే హాజీపూర్‌ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడం తోపాటు మరిన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మహేష్‌ భగవత్‌ తెలిపారు. గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సీసీ కెమరాలను మరమత్తు చేశామని ఆయన స్పష్టం చేశారు. హాజీపూర్‌లో బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన దారుణ ఘటనలో నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారని టీపీసీసీ ఉమెన్‌ వింగ్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు.

Next Story