logo

జింకలను వేటాడి చంపిన వేటగాళ్లు

జింకలను వేటాడి చంపిన వేటగాళ్లు
Highlights

అనంతపురం జిల్లాలో వేటగాళ్లు బరితెగించారు. విడపనకల్లులో జింకలను వేటాడి చంపిన నిందితులను పోలీసులు అదుపులోకి...

అనంతపురం జిల్లాలో వేటగాళ్లు బరితెగించారు. విడపనకల్లులో జింకలను వేటాడి చంపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బళ్లారికి చెందిన గోపి తన స్నేహితులతో కలిసి తుపాకీతో జింకలు వేటాడినట్లు గుర్తించారు. జింకలను చంపి చర్మం వలిచి మాంసం పట్టుకు వెళ్తుండగా గమనించిన పోలీసులను చూసి పరాపోతుండగా పట్టుకున్నారు. వీరన్న, శివ అనే వ్యక్తులు తుపాకీతో పారిపోయారు. గోపి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి జింక చర్మం, మాంసం, కత్తి, ఆకురాయి లను స్వాధీనం చేసుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top