నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
x
Highlights

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే మ్యానిఫెస్టోను సిద్ధం చేసిన ఆ పార్టీ.. నేడు రాహుల్ చేతుల మీదుగా మ్యానిఫెస్టోను...

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే మ్యానిఫెస్టోను సిద్ధం చేసిన ఆ పార్టీ.. నేడు రాహుల్ చేతుల మీదుగా మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రాహుల్ గాంధీ కోర్ టీం లోని సీనియర్ నేతలు ఈ మానిఫెస్టోకు రూపకల్పన చేశారు. దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ మానిఫెస్టోలో ముఖ్యంగా ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభం, విద్యా, వైద్య రంగాల బలోపేతంపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

కాగా దేశంలో అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 నగదు సాయం అందిస్తూ న్యాయ్‌ పేరిట ఆ పార్టీ ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పధకం కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో హైలైట్‌గా నిలవనుంది. ఇక ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు నెరవేర్చేలా మేనిఫెస్టో రూపొందించారు. కాగా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories