అందుకే మాపై తప్పుడు ఆరోపణలు : సినీ నటి భానుప్రియ

అందుకే మాపై తప్పుడు ఆరోపణలు : సినీ నటి భానుప్రియ
x
Highlights

సినీ నటి భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. ఇంట్లో పనికి పెట్టుకున్న బాలికను హింసించారంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు వచ్చింది....

సినీ నటి భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. ఇంట్లో పనికి పెట్టుకున్న బాలికను హింసించారంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. తమ అమ్మాయిని అప్పగించమని అడిగితే.... దొంగతనం కేసు పెడతానని బెదిరిస్తోందని బాలిక తల్లి ఆవేదన వ్యక్తంచేస్తోంది.

తల్లి, అక్క, వదిన లాంటి పాత్రలతో వెండి తెరపై అలరించిన సినీ నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. చెన్నై నివాసంలో తన కుమార్తెను పని కోసం పెట్టుకున్న భానుప్రియ... ఆమెను వేధిస్తోందని బాలిక తల్లి ప్రభావతి కంప్లైంట్ ఇచ్చింది. తమ అమ్మాయిని అప్పగించమని అడిగితే.... దొంగతనం కేసు పెడతానని బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తోంది.

తమ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో... ఏడాదిన్నర క్రితం తమ అమ్మాయిని... భానుప్రియ ఇంట్లో నెలకు 10వేల రూపాయలకు పనికి పెట్టామని, అయితే ఇప్పటివరకు జీతం ఇవ్వకపోగా, వేధింపులకు పాల్పడుతోందని బాలిక తల్లి ఆరోపిస్తోంది. మీ అమ్మాయి మీకు కావాలంటే 10లక్షలు ఇచ్చి తీసుకెళ్లాలని తనను కొట్టి గెంటేశారని ఆవేదన వ్యక్తంచేస్తోంది. పనిలో పెట్టుకున్న నాటి నుంచి తన కుమార్తెను ఇంటికి పంపలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడించడం లేదని బాలిక తల్లి... పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ... తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డడుతున్నాడని బాలిక తల్లి ఆరోపిస్తోంది. మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని తమ అమ్మాయి ఫోన్ చేయడంతో... చెన్నై వెళ్లాని, అయితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ తనను గెంటేశారని బాలిక తల్లి తన ఫిర్యాదులో తెలిపింది.

తమ కుమార్తె‌ను సినీనటి భానుప్రియ వేధిస్తోందని బాలిక తల్లి ప్రభావతి కంప్లైంట్ ఇచ్చిందని సామర్లకోట ఎస్సై తెలిపారు. భానుప్రియ చెన్నైలో నివాసం ఉంటుండటంతో... చట్టప్రకారం ఎలా ముందుకెళ్లాలో ఉన్నతాధికారులను సంప్రదించి ముందుకెళ్తామన్నారు.

అయితే బాలిక తల్లి ఆరోపణలను భానుప్రియ ఖండించారు. విలువైన వస్తువులను బాలిక చోరీ చేసిందని, దొంగతనం గురించి తల్లిని పిలిపించి ప్రశ్నించినందుకే... తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని భానుప్రియ అంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories