సినీనటిని దారుణంగా హత్య చేసిన దర్శకుడైన భర్త

సినీనటిని దారుణంగా హత్య చేసిన దర్శకుడైన భర్త
x
Highlights

సినీ సహాయ నటి దారుణ హత్యకు గురైంది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. సినీ దర్శకుడైన భర్త ఆమెను దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల...

సినీ సహాయ నటి దారుణ హత్యకు గురైంది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. సినీ దర్శకుడైన భర్త ఆమెను దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేశాడు. వివరాల్లోకి వెళితే కన్యాకుమారీ జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన సంధ్య (38) అనే యువతి కొన్నిరోజులుగా కనపడటం లేదని సంధ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు చెన్నై శివారు పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో గుర్తుతెలియని మహిళకు రెండు కాళ్లు, ఒక చేయిని గత నెల 21న పోలీసులు గుర్తించారు. కాగా హత్యకు పాల్పడింది ఎవరనే విధంగా విచారణ చేపట్టారు.

దాంతో 2 వారాల పాటు శ్రమించి నిందితుడిని బుధవారం అరెస్ట్‌ చేశారు. అదృశ్యమైన యువతి భర్త సినీ దర్శకుడైన బాలకృష్ణన్‌ ను నిందితుడుగా గుర్తించారు. దీంతో మంగళవారం రాత్రి బాలకృష్ణన్‌ ను అదుపులోకి తీసుకున్నారు. తన భార్యను చంపడానికి గల కారణాలను బాలకృష్ణన్‌ పోలీసులకు వివరించాడు ..తామిద్దరం సినీపరిశ్రమకు చెందిన వారిమేనని. సంధ్య కొందరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు చెప్పాడు. రాత్రివేళల్లో సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, బయటకు వెళ్లడం వంటి చర్యలకు సంధ్య పాల్పడుతుండటంతో తమ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త అనేకసార్లు మందలించినా ఆమె వినిపించుకో లేదు. విడాకులు కూడా ఇవ్వకుండా మరో వ్యక్తితో ఉంటానని సంధ్య తేల్చిచెప్పడంతో ఆమెను హత్య చేశానని వెల్లడించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories