TS News: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణం

TS News: కరీనంగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు.

Dhivi
Published on: 21 Jun 2024 5:16 AM IST
TS News: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణం
X

TS News: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణం

TS News: కరీనంగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి గురువారం సాయంత్రం సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయం అర్థరాత్రి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం హైదరాబాద్ అల్వాల్ తోని పంచశీల కాలనీలోని ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

కాగా ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె రెండు రోజులు నుంచి పాఠశాలకు వెళ్లలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే ఉదయమే చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్దిరోజులు క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చాయి. ఇక రూపాదేవి డెడ్ బాడీని పోలీసులు కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Dhivi

Dhivi

Next Story