Top
logo

తోసుకున్న విద్యార్థులు.. మంటలు చెలరేగడంతో గాయాలు

తోసుకున్న విద్యార్థులు.. మంటలు చెలరేగడంతో గాయాలు
X
Highlights

చిత్తూరు జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం చర్లపల్లెలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్నిప్రమాదం...

చిత్తూరు జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం చర్లపల్లెలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్నిప్రమాదం జరగడంతో మంటల్లో చిక్కుకుని ఆరుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. డిజిటల్‌ క్లాసులు ఉన్నాయని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు డిజిటల్‌ గదికి చేరుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో యాసిడ్‌ బాటిల్స్‌ కిందపడి మంటలు రేగాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story