జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసుల సస్పెండ్

జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసుల సస్పెండ్
x
Highlights

పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడింది. ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌,...

పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడింది. ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, రాంబాబులను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జయరామ్ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారంటూ రాకేష్ రెడ్డి‌కి ఈ ముగ్గురు పోలీసులు సలహా ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు పోలీసు అధికారులు రాకేష్‌రెడ్డి‌తో కలిసి లావాదేవీలు సాగించినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు డీజీపి. కాగా జయరాం కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్‌ పోలీసులు అన్ని కోణాల్లోని విచారణ సాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories