Top
logo

మీడియా ముందుకు జయరాం హత్య కేసు నిందితులు

మీడియా ముందుకు జయరాం హత్య కేసు నిందితులు
X
Highlights

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ కేసులో...

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి, అతనికి సహకరించిన మరికొందరిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా గత శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున కారులోని మృత దేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, తర్వాత కారులో ఉన్నది చిగురుపాటి జయరాంగా గుర్తించారు. జయరామ్ మృతదేహాం కారు వెను క సీట్లో ఉండగా, ఆయ‌న త‌ల‌కు బ‌ల‌మైన గాయాల‌య్యాయి. దీంతో అతను హత్యగావించారని పోలీసులు తేల్చారు.

Next Story