జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై తేల్చి చెప్పిన ఎస్పీ

జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై తేల్చి చెప్పిన ఎస్పీ
x
Highlights

కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి అతనితోపాటు మరో వ్యక్తి శ్రీనివాస్‌ని కృష్ణా జిల్లా...

కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి అతనితోపాటు మరో వ్యక్తి శ్రీనివాస్‌ని కృష్ణా జిల్లా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేషే అని పోలీసులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎస్పీ త్రిపాఠి కేసు వ్యవహారాలపై మాట్లాడారు. డబ్బు కోసమే జయరాంను హింసించి చంపినట్టు దర్యాప్తులో వెల్లడైనట్టు త్రిపాఠి చెప్పారు. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి నేరం అంగీకరించాడని తెలిపారు. జయరాం హత్య కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్ర లేదని తేల్చి చెప్పారు. హత్యలో ఆమె కూడా పాలుపంచుకున్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదని ఎస్పీ వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు ప్రధాన కారణంగా వివరించారు. జయరాంకు అప్పుగా ఇచ్చిన 4.5 కోట్ల రూపాయలు, శిఖాకు ఇచ్చిన మరో కోటిన్నర కలిపి ఆరు కోట్ల రూపాయల కోసం… రాకేష్‌ ఒత్తిడి చేయడంతో.. జయరాం ఆయన ఫోన్‌ ఎత్తడం మానేశాడని త్రిపాఠి చెప్పారు.

దీంతో ఆగ్రహం పెంచుకున్న రాకేష్‌ ప్లాన్‌ ప్రకారం జయరాంను కిడ్నాప్‌ చేసి.. చిత్రహింసలు పెట్టడంతో అతను మృతి చెందాడని చెప్పారు. శిఖా చౌదరికి సంబంధించిన ఓ ప్లాటు వివాదాన్ని పరిష్కరించాలంటూ జయరాం రాకేష్‌ రెడ్డికి ఫోన్ చేశారని.. అప్పటి నుంచే రాకేష్‌కు, శిఖాకు మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు చెప్పారు. అయితే కొంత కాలంగా వారి మధ్య సంబంధాలు లేవని చెప్పారు. హత్యలో, శవాన్ని తరలించడంలో వాచ్‌మెన్‌ రాకేష్‌కు సహకరించినట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ కేసును హైదరాబాద్‌ పోలీసులకు అప్పగిస్తారా అని ప్రశ్నించగా.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories