Top
logo

ఉద్యోగాలిప్పిస్తానని కోట్లకు కుచ్చుటోపీ!

ఉద్యోగాలిప్పిస్తానని కోట్లకు కుచ్చుటోపీ!
X
Highlights

గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మోసం చేసింది. ఒకరిద్దరని కాదు ఏకంగా 132...

గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మోసం చేసింది. ఒకరిద్దరని కాదు ఏకంగా 132 మంది నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. పది కోట్ల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండాపోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాలివీ..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ గా సుమలత పని చేస్తున్నారు. తనకు అధికారులు బాగా తెలుసు అని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించింది. ఒక్కో నిరుద్యోగి నుంచి లక్ష నుంచి అయిదు లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసింది. ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో ఎస్ ఓ సుమలత అసలు రూపం బయటపడింది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మొత్తం 132 మంది నిరుద్యోగుల నుంచి సుమలత పది కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ఎస్ ఓ సుమలత ప్రస్తుతం పరారీలో ఉంది.

Next Story