Top
logo

షర్మిల కేసులో మరో వ్యక్తి అరెస్ట్‌

షర్మిల కేసులో మరో వ్యక్తి అరెస్ట్‌
X
Highlights

వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై దుష్ప్రచారం కేసులో డొంక...

వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై దుష్ప్రచారం కేసులో డొంక కదులుతోంది. హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులు క్రమంగా పురోగతి సాధిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆదివారం అడ్డురి నవీన్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్‌ పోలీసులు నిందితుడిని హైదరాబాద్‌ తరలించారు. మంచిర్యాల జిల్లా రామనగర్‌కు చెందిన నవీన్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్‌ షర్మిలపై అసభ్యకర పోస్టులు పెడుతూ..

కుట్ర చేసిన కారణంగా అతనిపై సెక్షన్‌ 509 ఐపీఎస్‌, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. కాగా శనివారం ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావును గుంటూరులో అరెస్టు చేశారు. ఇతనిపై కూడా ఐపీసీ సెక్షన్‌ 509, 67(ఎ) ఐటీ యాక్ట్‌తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story