Top
logo

వృద్ధ తల్లిదండ్రులను కిరాతకంగా హత్య చేసిన తనయుడు

వృద్ధ తల్లిదండ్రులను కిరాతకంగా హత్య చేసిన తనయుడు
X
Highlights

పశ్చిమబెంగాల్ నార్త్ 24 పొరగణ జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వానికి మాయని మచ్చ ఈ ఘటణ. కన్న తల్లిదండ్రులపై ఇనుపరాడ్ లో దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశాడు ఓ కశాయి కొడుకు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... పారగణ జిల్లాలో సునీల్ సాహా అతని భార్య షేఫ్ హలీ సాహా కుమారుడు అమిత్ సాహా నివాసిస్తున్నారు.

పశ్చిమబెంగాల్ నార్త్ 24 పొరగణ జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వానికి మాయని మచ్చ ఈ ఘటణ. కన్న తల్లిదండ్రులపై ఇనుపరాడ్ లో దాడి చేసి అతి కిరాతంగా హత్య చేశాడు ఓ కశాయి కొడుకు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... పారగణ జిల్లాలో సునీల్ సాహా అతని భార్య షేఫ్ హలీ సాహా కుమారుడు అమిత్ సాహా నివాసిస్తున్నారు. అయితే అమిత్ సాహాకు పెళ్లయిన కొన్ని రోజులకే భార్య నుంచి విడాకులు తీసుకున్నారు.అయితే అప్పట్నుంచి అమిత్ ప్రవర్తన వింతగా ఉండేదని.. నారాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపారు.

కాగా.. అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియని పరిస్థితుల్లో , వృద్ధ తల్లిదండ్రులే అతన్ని చూసుకునేవారు. మంగళవారం రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులపై ఇనుపరాడ్ తో దాడి చేశారు. ఇద్దరు రక్తపు మడుగులో పడివుండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు అమిత్‎ను అరెస్టు చేశారు. అమిత్ మానసిన పరిస్థితి బాగోలేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. అయితే హత్యకు దారి తిసిన కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story