Black Magic: చేతబడి కలకలం.. క్రికెట్‌ మైదానంలో నల్లకోడిని బలిచ్చి..

Arun Chilukuri
Updated on: 18 Feb 2020 1:03 PM IST
Black Magic: చేతబడి కలకలం.. క్రికెట్‌ మైదానంలో నల్లకోడిని బలిచ్చి..
X
చేతబడి కలకలం.. క్రికెట్‌ మైదానంలో నల్లకోడిని బలిచ్చి..

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో చేతబడి కలకలం రేపింది. అల్లాజల ప్రసాదం రోడ్డు వద్ద ఉన్న క్రికెట్‌ మైదానంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక పెద్ద బొమ్మ గీసి నిమ్మకాయలు, గుమ్మడికాయలు పెట్టి మేకులు కొట్టి పూజలు చేసినట్లు చిత్రాలు ఉన్నాయి. ఇది చేతబడే అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిసరాల్లో నల్లటి కోడిని కూడా బలి ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి.

సోమవారం ఉదయం క్రికెట్ ఆడేందుకు క్రీడాకారులు మైదానానికి వెళ్లారు. అక్కడ ముగ్గులు చేతబడి ఆనవాళ్లు చూసి వారు భయాందోళనకు గురై అక్కడ నుంచి పారిపోయారు. గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామం అంతా ఈ విషయం తెలిసి భయాందోళనకు గురవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story