ఆరేళ్ళ బాలికను దారుణంగా హతమార్చిన మేనత్త..

ఆరేళ్ళ బాలికను దారుణంగా హతమార్చిన మేనత్త..
x
Highlights

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. పెదబయలు మండలం లకేయుపుట్టులో ఆరేళ్ళ బాలిక పట్ల ఘోరంగా ప్రవర్తించింది బాలిక మేనత్త. కట్టెల కోసం వెళ్దామని కొండపైకి ఆరేళ్ల...

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. పెదబయలు మండలం లకేయుపుట్టులో ఆరేళ్ళ బాలిక పట్ల ఘోరంగా ప్రవర్తించింది బాలిక మేనత్త. కట్టెల కోసం వెళ్దామని కొండపైకి ఆరేళ్ల బాలికను తీసుకెళ్లిన రస్మో కొండపైన చిన్నారిని నరికి చంపి అనంతరం రక్తం తాగింది. స్థానికంగా ఈ ఘటనా సంచలనంగా మారింది. భార్యభర్తల మధ్య వచ్చిన తగాదాతో వంతల రస్మో తన తమ్ముడి ఇంటికి వచ్చి ఉంటుంది. అయితే అత్తారింటికి వెళ్ళమని తమ్ముడి భార్య రస్మోతో గొడవ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మరదలిపై రస్మో కక్ష పెంచుకుంది. దాంతో కట్టెలకోసం కొండప్రాంతానికి మేనకోడలు అనితను తీసుకెళ్లింది.

మద్యం మత్తులో బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమానుషంగా కత్తితో నరికి చంపింది. అనంతరం రక్తం తాగి లకేయుపుట్టుకు వచ్చి పిచ్చిపిచ్చిగా కేకలు వేయడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కుటుంబసభ్యులు, స్థానికులు అడవిలోకి వెళ్లి చూడగా అనిత మృతదేహం కనిపించింది. దాంతో రస్మోను చెట్టుకు కట్టేసి చితకబాదారు. భర్త వద్దకు పొమ్మనందుకు కుమార్తెను కిరాతకంగా హతమార్చిందని అనిత తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories