అర్ధరాత్రి సినీనటి యాషికా కారు బీభత్సం.. వ్యక్తిని ఢీకొట్టి..

అర్ధరాత్రి సినీనటి యాషికా కారు బీభత్సం.. వ్యక్తిని ఢీకొట్టి..
x
Highlights

అర్ధరాత్రి సినీనటి యాషికా కారు బీభత్సం.. వ్యక్తిని ఢీకొట్టి.. అర్ధరాత్రి సినీనటి యాషికా కారు బీభత్సం.. వ్యక్తిని ఢీకొట్టి..

అర్ధరాత్రి సినీనటి యాషికా కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం నుంగంబాక్కం సమీపంలో జరిగింది. శనివారం నటి యాషిక తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ ముగించుకుని అర్ధరాత్రి ఖరీదైన కారులో వస్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా కారును నడుపుతున్నారు. అయితే స్థానిక హారింగ్‌టన్‌ రోడ్డు వద్ద అదుపు తప్పి వ్యక్తిని ఢీకొంది.

అతనికి తీవ్ర గాయాలు కావడంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పాండిబజార్‌ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. కాగా పోలీసుల విచారణలో నటి యాషిక తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో ఉన్నట్టు గుర్తించారు. అతివేగం కారణంగానే ఈ యాక్సిడెంట్‌ జరిగినట్లు నిర్ధారించి.. కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories